Header Banner

పన్ను శాఖ తప్పిదమా? ఆధార్ దుర్వినియోగమా?.. వృద్ధురాలికి ఊహించని ఆవేదన! ఐటీ శాఖ నోటీసుతో షాక్!

  Wed Apr 09, 2025 22:21        Others

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరుపేద వృద్ధురాలికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆమెకు రూ. 4 కోట్లకు పైగా ఆదాయం ఉందని, అందుకు సంబంధంచిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సబ్రా అనే వృద్ధురాలు జస్రన పట్టణంలోని మురికివాడలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆ దంపతులిద్దరూ దినసరి కూలీలు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదికి రూ. 4.88 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడేళ్ల కిందట నోటీసులు జారీ చేశారు. సబ్రాకు చదువు రాకపోవడంతో ఆమె ఆ నోటీసులకు స్పందించలేదు.
ఆమె పన్ను చెల్లింపు జరపకపోవడంతో అధికారులు తాజాగా మరోసారి నోటీసులు పంపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించారు. పన్ను ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై న్యాయవాది సంజయ్ జన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో నోటీసులు జారీ చేసే సమయంలో పొరపాట్లు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే వృద్ధురాలికి నోటీసులు వచ్చాయని తెలిపారు. పొరపాటు జరగని పక్షంలో ఆధార్ ఫోర్జరీకి సంబంధించిన అంశం కూడా అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ITNoticeShock #AadhaarMisuse #TaxDeptBlunder #ElderlyWomanInShock